Categories
సాదత్ హాసన్ మంటో కేవలం స్త్రీల గురించి మాత్రమే ,అందునా వేశ్య వాటికలో ఎన్నో హింసలకు గురయ్యే స్త్రీల గురించి గొప్ప కథలు రాశారు. ఆయన రాసిన అద్భుతమైన కథలు ,భోల్ దో ,టాబా ,టేక్ సింగ్,ఠండా ఘోష్ కథలన్ని కలపి మంటో పేరుతో సినిమా తీశారు నందితా దాస్. రచయిత సాదత్ మంటో పైన గౌరవంతో ,ప్రేమతో ఆయన పాత్రలో నటించిన నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి పారితోషికం తీసుకొన్నడట. అమృతసర్ లో పుట్టిన మంటోకి భారత దేశం అంటే చాలా ఇష్టం దేశ విభజన సమయంలో అతను పాకిస్థాన్ వెళ్ళిపోయాడు. భారత దేశాన్ని పలవరిస్తూనే చనిపోయాడు. నందితా దాస్ నాలుగేళ్ళు కష్టపడి మరీ తీసిన మంటో సినిమా థియేటర్ లలో ఉంది. వీలైతే చూడండి.