టూత్ పేస్ట్ తో ఎన్నో మురికి మరకలు పోగొట్టవచ్చు. ఫోన్ కోసం ట్రాన్స్ పరెంట్ కవర్లు వాడుతూ ఉంటాం అవి పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. టూత్ పేస్ట్ లో కొన్ని చుక్కల నీళ్లు కలిపి ఈ కవర్ పై రుద్ది కడిగితే కొత్త వాటిలా కనిపిస్తాయి. గోడల పైన పడిన కాఫీ మరకలు కూడా టూత్ పేస్ట్ వేసి రుద్దితే పోతాయి. పిల్లలు తెల్లవి షూ మురికిగా అయిపోతే టూత్ పేస్ట్ వేసి రుద్ది కడిగితే తెల్లగా వస్తాయి.

Leave a comment