Categories
గూగుల్ మ్యాప్ తెరిస్తే హాయిగా ఆ సూచనల ప్రకారం వెతుక్కోకుండా వెళ్ళిపోతాం .ఈ మ్యాపింగ్ చేసింది సి ఇ ఇన్ఫో సిస్టమ్స్ అది నేత్రి రస్మి వర్మ. 1970లో ఐటిఐ లో ఏకైక మహిళా విద్యార్థిని రస్మి. 12 సంవత్సరాలు అమెరికా లో పనిచేసి ఇండియా వచ్చి మ్యాప్ మై ఇండియా అనే పేరుతో భారత దేశపు డిజిటల్ మ్యాప్ రూపొందించింది.మ్యాప్ లో ఇంటి నుంచి ఇంటికి ట్రాఫిక్ అంశాలు స్పీడ్ లిమిట్స్ రోడ్డు పైన గతుకులు గుంటలు తో సహా పూర్తి సమాచారం ఇస్తుంది. ఇప్పటికీ 18 మిలియన్ స్థలాల మ్యాప్ 6 మిలియన్ కిలోమీటర్ల రహదారులు 15 మిలియన్ల అడ్రస్ లు మ్యాప్ చేశారు రస్మి వర్మ ఆమె భర్త రాకేష్ తో కలిసి పనిచేస్తుంది రస్మి వర్మ.