ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మేకప్ ను కూడా వదల్లేదు, మేకప్ రంగంలో కరోనా కు ముందు కరోనా తర్వాత అన వలసి ఉంటుందని ప్రముఖ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.మాస్క్ ల వెనక పెదవులను దాచేయడంలో ఇప్పుడిక పెదవుల సంగతి ఎలా ఉన్నా పెద్ద పట్టింపు లేదు. చాలా మంది మహిళలు లిప్స్టిక్  పూసుకోవడం  మానేశారు. వాటి అమ్మకాలు చాలా వరకు తగ్గిపోయాయి ఇది వరకు పెదవుల అందానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడూ కళ్ళకి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఐ షాడో లు  ఎన్నో రంగుల్లో రాబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడు మేకప్  అంటే కళ్ళ సౌందర్యం అయిపోయింది.

Leave a comment