అరడజను సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా దిగ్గజ క్రీడాకారిణి మేరీ కోమ్ ను భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించింది . బాగా వెనక బడిన ఈశాన్య ప్రాంతంలో పుట్టిన ఈ అమ్మాయి మొదటిసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం ,ఆ తర్వాత సంవత్సరం కూడా స్వర్ణం సాధించింది. 2005 ,2006,2008,2010 సంవత్సరాల్లో ప్రపంచ ఛాంపియన్ అయింది . 2012లో లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకొంది . ఇద్దరు బిడ్డల తల్లి అయ్యాక కూడా 34 ఎళ్ళ వయసులో మళ్ళీ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది మేరీకోమ్ . 2006 లో పద్మశ్రీ 2013 పద్మవిభూషణ్ . 2003లో అర్జునా,2009లో రాజీవ్ భేల్ రత్న అవార్డులు దక్కించుకొంది ఈ అద్భుతమైన క్రీడాకారిణి .