ఎంతో బిజీ లైఫ్ ఉద్యోగాల్లో టార్గెట్స్ ఇళ్లల్లో అంతులేని పని వత్తిడి పది నిముషాలు విశ్రాంతి తీసుకునే పాటి అవకాశం లేకుండా ఒక్కరోజు గడుస్తూ ఉంటుంది. ఇక బయటకొస్తే అంతులేని ట్రాఫిక్. పది నిముషాలు పోవాలిసిన చోటికి గంట ప్రయాణాలు. ఇలాంటి సందర్భాల్లో చిరాకు దిగులు నిస్పృహ అన్నీ కలుగుతాయి. మనసుకి శాంతి నిచ్చే సెరోటోనిన్ రసాయనం పూర్తిగా ఎండా కున్నంత పనవుతుంది. ఇలాంటప్పుడు మస్సాజ్ ట్రై చేయండి. అంటున్నారు. ఎక్సపెర్ట్స్ . ఆధునిక జీవితంలో దీని అవసరం ఎవ్వరు తెలుసుకోవటం లేదు. ఇది కండరాలకు హాయి నివ్వటమే కాదు. కార్టిసాల్ అనే ఒత్తిడి కారక హార్మోన్ ను 30 శాతం దాకా అడ్డుకుంటుందని పరిశోధనలు నిరూపించాయి. కార్టిసాల్ తగ్గటం అంటే సెరోటోనిన్ పెరగటమే కదా. అలాగే ధాన్యం కూడా ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత ఇస్తుందంటారు. ధాన్యం వల్ల మెదడులో 4- హెచ్ఎఎ 1 అనే ఆమ్లం విడుదలవుతుంది. సెలటోనిన్ ఉత్పత్తికి దోహదం చేసేది ఇదే. నిత్యం కాస్త ఉత్సాహంగా ఉండేందుకు ధాన్యం ఎంచుకోవచ్చు. ఉదయ సాయంత్రాలు లేలేత ఎండలో వుండటం వ్యాయామం చేయటం ఇవన్నీ ఒత్తిడిని తగ్గించేవే !!
Categories