Categories
అనారోగ్యాలు తగ్గించటంలో వైద్యుడు ఇచ్చే మందుల్లాగా మాటలు పని చేస్తాయంటున్నాయి అధ్యయనాలు . మంచిగా మాట్లాడి రోగులకు మహా దైర్యం ఇవ్వగలిగిన వైద్యుడు దగ్గరకు వెళ్ళాలట వైద్యవృత్తిలో కాస్త అనుభవం తక్కువైనా పర్లేదు మన్నన ,ఓర్పు స్వభావం చక్కని మాటలు చెప్పగలిగే నేర్పు ఉంటేచాలు . నీకు భయంలేదు . ఇది సామాన్యమైన ఇబ్బందే . ఇది తగ్గుతుంది వంటి మాటలు ప్రయోగించే వైద్యుడి వల్ల రోగికి స్వాంతన కలిగి సగం రోగ లక్షణాలు మాయం అవుతాయంటున్నారు స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ వైద్య బృందం. కొన్ని ఎంత గ్గోప మందులు వాడినా ఒక పట్టాన లొంగవు వైద్యుడి నోటి మాటలకే వాటిని తగ్గిచ గలిగే ప్రభావం ఉంటుందంటున్నాయి అధ్యయనాలు .