Categories
ఏదైనా సమస్య వస్తే స్పందించకుండా ఉండగలమా? అలా ఉండగలిగితే ఎలాంటి వత్తిడి వుండదు. అప్పుడు మౌనంగా నిశబ్ధంగా వుంటే మెదడు ను కల్లోల పరచకుండా వుంటే వత్తిడి పెరగదు. కొత్త ఆలోచనలు వస్తాయని ఒక రిపోర్ట్. మౌనంగా ఉండటానికి మెదడు ప్రశాంతతకు సంబంధం వుంది. మనిషి లోని, భావోద్వేగాలు జ్ఞాపకాల నైపుణ్యాన్ని హిప్పోకేంపస్ నియంత్రిస్తుంది. ఈ ప్రాంతాల్లో కొత్త కణాలు ఏర్పడటం వల్ల మెదడు ఎంతో చురుగ్గా ఆరోగ్యంగా వుంటుంది. ఏ సమస్య ఎదురైనా మౌనంగా వుండగలిగితే ప్రశాంతంగా వత్తిడి లేకుండా వుంటుంది. ఎన్నో అనారోగ్యాలకు కారణం అయినా వత్తిడి జయించండి అంటున్నారు పరిశోధనలు.