వినాయక చవితికి ఏక గణపతి ని తయారు చేయించండి విగ్రహం కోసం మెత్తగా తయారు చేసిన మట్టిలో పెసలు ఆవాలు కూరగాయల గింజలు కలపమంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.చవితి వేడుకలు అయ్యాక ఈ విగ్రహాన్ని నీళ్లలో కరిగించి ఒక చిన్న తొట్టిలో వేస్తే వారం రోజుల్లో అందులో ఉంచిన గింజలు మొలకలు వస్తాయి.ఆ పచ్చదనం ఎప్పటికీ వాడిపోని పండగ అలాగే ఉంటుందంటున్నారు.వినాయకుడిని తయారు చేసే విధానం యూట్యూబ్ వీడియోలో చూడవచ్చు బంక మట్టి నీరు టూత్ పిక్స్ గానీ పుల్లలు గానీ చాకు స్పూన్ తో వినాయకుడి రూపం వచ్చేలా చేయాలి. కృత్రిమ రంగులు కాకుండా ఇంట్లో ఉండే పసుపు బీట్ రూట్  రసం తో విగ్రహానికి రంగులు అద్దాలి.ఇంట్లో పిల్లల చేత ఈ బొమ్మలు చేయించండి,పర్యావరణ స్ఫూర్తి కలిగించండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.

Leave a comment