ఒడిశా గిరిజన మహిళ ఉషారాణి నాయర్ స్థానికంగా పెరిగే సబాయ్ గడ్డి తో ఎన్నో కళాకృతులు తయారు చేసి అమ్మడం ద్వారా ఎంతో మంది గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.మయూర్ భంజ్ సబాయ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ఉషారాణి పర్యావరణ హితమైన హస్తకళ ఉత్పత్తుల తయారీ సంస్థను ప్రారంభించారు.2001లో ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా.గుజల్ దిహీ లో స్వయం సహాయక బృందం ప్రారంభించిన తరువాత ఈ పదేళ్ల ప్రయాణంలో ఉషారాణి ఎన్నో రకాల ఉత్పత్తుల పనులు చేపట్టి ఎన్నో ఒడిదుడుకుల తరువాత సబాయ్ గడ్డి తో చేసే చేనేతలు చాపలు స్టాండ్ లు వంటి రకరకాల వస్తువులు తయారీ ద్వారా విజయం సాధించింది. ప్రభుత్వం వారికోసం భువనేశ్వర్ లో షాపులు కేటాయించింది.

Zoomed out of item.

Leave a comment