పిల్లలకు స్టిక్కర్లు , కుంకుమలు పెట్టకండి వాటిలో హాని కరమైన రసాయనాలు ఉంటున్నాయి  అని హెచ్చరిస్తున్నారు వైద్యులు .కుంకుమలో రంగు సువాసన కోసం సీసం పాదరసం, కర్పురాం ,సింథటిక్స్ జింక్ వంటివి కలుపుతారు . వీటివల్ల చర్మ సంబంధిత అలర్జీలు వస్తాయి. మరీ సున్నితమైన వారికి బొబ్బలు , దద్దుర్లు కూడా రావచ్చు. సాధారణంగా ఇంట్లో కుంకుమ తయారు చేసుకోవటం తేలికే . పసుపు పొడిలో నిమ్మరసం కలిపితే కుంకుమ తయారవుతుంది. రెడ్ మార్బుల్ స్టోన్ పైన పసుపు నూనె వేసి నాలుగు రోజులు కదిలించకపోతే కుంకుమ మంచి రంగులో తయారవుతుంది. ఇంట్లో వాడకం కోసం ఇవి ప్రయత్నం చేయవచ్చు.

Leave a comment