సుగంధ ద్రవ్యాలతో లవంగలది కీలక పాత్ర. లవంగం ఒక ఎండిన మొగ్గ లవంగ నూనె శక్తిమంతమైన నొప్పి నివారిణి. కండరాలు ఎముక గుజ్జు నరాల ప్లాస్మా నాడీ వ్యవస్థ పునరుత్పత్తి అవయవాల కణాల పై ప్రభావంతంగా పనిచేస్తుంది. శ్వాస ,నాడీ ,జీర్ణ వ్యవస్థ ను లవంగం టోన్ చేస్తుంది. శరీరాన్ని ఉద్వసం చేస్తుంది. నొప్పి నివారిణి గా నడుం సకృత్య సమస్య ల నివారణకు వాడదగినది. నీళ్లలో ఐదారు లవంగాలు వేసి కషాయం చేసుకుని తాగితే కఫం తగ్గుతుంది. ఉప్పు ,లవంగం కలిపి బుగ్గన పెట్టుకుంటే దగ్గు ఉపశమనం. ఎసిడిటీ వల్ల కలిగే అసౌకర్యానికి కుడా లవంగం మంచి ఉపశమనం. లవంగ పొడి తేనె లో చప్పరిస్తే వికారం వాంతులు తగ్గుతాయి. లవంగ మొగ్గలు నీటిలో వేసి మరగనిచ్చి తాగితే గర్భవతులు వికారం పోతుంది. కొబ్బరినూనెలో లవంగ నూనె కలిపి రాస్తే మొటిమలు వాటి మచ్చలు కుడా తగ్గిపోతాయి. నీళ్లలో లవంగ నూనె కలిపి స్ప్రే చేస్తే క్రిముల్ని దూరం చేసే రిపెలెంట్ గా పనిచేస్తోంది. పొడిగా నీటిలో వేసి కాచి డికాషన్ లాగా పాలతో కలిపి తీసుకున్నా లవంగాల తో జరిగే అన్నీ ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి.
Categories