Categories
ఇప్పుడు రెస్టారెంట్స్ లో రాగి సంకటి ట్రెండీ ఫుడ్ వీటిలో ,రకరకాల వంటలు చేయటం ఇటీవల చాలా పెరిగింది. రంగుల్లో కార్బో హైడ్రేట్స్ ఎక్కువ. ప్రోటీన్లు పీచు తో పాటు కాల్షియం కూడా పుష్కలంగా దొరుకుతోంది ఎముకల ఆరోగ్యానికి,పటిష్ఠతకు రాగిపిండి మేలుచేస్తుంది శరీరానికి అవసరమైన ఎన్నోరకాల అమైనో యాసిడ్స్ దొరుకుతాయి. గ్లూటెన్ ఫ్రీకావటం వల్ల త్వరగా అరిగిపోతోంది బరువు పెరగక పోవటం,స్థూలకాయం రాకపోవటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఎదిగే పిల్లలకు రాగిపిండి చాలా మంచిది ఒత్తిడిని సమర్ధవంతంగా తగ్గిస్తాయి. యంగ్జ్ యిటీడిప్రెషన్ మైగ్రైన్ తో బాధపడేవారికి రాగులు మంచి ఆహారం వీటిలో వుండే ట్రెప్టోఫాన్ నిద్రలేమి సమస్యలు స్వాభావికంగా తగ్గిస్తుంది.