Categories
వేపాకులను నూరి పసుపుతో కలిపి రాస్తే ఎలాంటి మచ్చలయినా పోతాయని ఆయుర్వేదం నిర్ధారించింది. అందుకే సౌందర్య ఉత్పత్తుల్లో వేపాకు వాడకం ఎక్కువే. సబ్బులు ,క్రీములు చాలానే వచ్చాయి. అప్పుడే చెట్టు నుంచి కోసిన వేపాకులు మెత్తగా నూరి కాసిని నీళ్ళతో మరిగించాలి. చిక్కని పచ్చని రసం దిగుతుంది. ఇందులో పాలు ,తేనే ,పెరుగు కలిపి ముఖానికి పట్టించి ఆరగంట తర్వాత వేడి నీళ్ళలో మొహాం కడిగేసుకొంటే నల్లని మరకలు బ్లాక్ హెర్స్,వైట్ హెర్స్ అన్ని పోతాయి. వేపాకులు మరిగించిన నీళ్ళతో తల స్నానం చేసి తర్వాత జుట్టు కడుక్కుంటే , ఇలా చేస్తే చుండు తగ్గటమేకాదు వెంట్రుకలు మెత్తగా మెరుస్తూ ఉంటాయి. ఈ వేప నీళ్ళుతో చర్మసంబంధమైన ఇన్ ఫెక్షన్స్ కూడా పోతాయి.