నడిస్తే కాళ్ళు నొప్పులంటారు గానీ రోజువారీ నడక వల్ల  కండరాలు నొప్పులు రాకపోగా చాలా రిలాక్స్ అవుతాయంటున్నారు నిపుణులు . ఇతర తరహా వ్యాయామాలతో వెన్నుముక్క పైన ఒత్తిడి పడుతుందేమో గానీ నడక లో అలాంటిది ఏదీ ఉండదు. ఎన్నో రకాల అనారోగ్య ఇబ్బందులను ఎదుర్కునే శక్తీ నడక తో వస్తుంది. డయాబెటిస్ రక్తపోటు అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచేందుకు కొవ్వు కరిగేందుకు నడకే తగినది. నడక వల్ల  అన్ని భాగాల్లోని కొవ్వులు కరుగుతాయి. ఆ సమయంలో విడుదలయ్యే హార్మోన్లు ఇన్సులిన్ ఉత్పత్తి చేయటంలో సహాయపడతాయి . ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఒక్కోసారి ఒత్తిడికి గురైతే కండరాలు పట్టేసినట్లవుతాయి. అప్పుడు కూడా ఆ కండరాలు సాధారణ స్థితికి తెచ్చేది నడకే . శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై ఆదుర్దాని వత్తిడి ని తగ్గించి ప్రశాంత పరివచ్చి నిద్రను ప్రసాదిస్తుంది నడక . ఇది సర్వ రోగ నివారిణి. రుచికరమైన పదార్ధాలు తింటేనే శరీరం బరువు నియంత్రించుకోగలుగుతారు.

Leave a comment