Categories
నడకా వ్యాయామం వీటికి సమయం సరిపోదని చెప్పేవారికి చివరకు లిఫ్ట్ ఉపయోగించకండి, మెట్లు ఎక్కి దిగండి అని వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇలా మెట్లు ఎక్కి దిగడం వల్ల శరీరానికే కాదు మెదడుకీ ఆరోగ్యం, చురుకుదనం వస్తుందని పరిశోధకులు చెప్పుతున్నారు. పదిహేడు నుంచి 70 సంవత్సరాల వయసున్న 300 మంది వ్యక్తుల పైన ఈ పరిశోధన కొనసాగింది. వయస్సు రిత్యా జ్ఞాపక శక్తి తగ్గడం, అలోచిన్చాలేకపోవడం వంటి సమస్యలను మెట్లు ఎక్కడం ద్వారా మెదడులో సంభవించే పలు పరిణామాలకు కూడా ఈ వ్యయామం చెక్ పెడుతుందని అంటున్నారు. అయితే ఆరోగ్య సమస్యలతో బాధ పడేవారు మాత్రం వైద్యుల సలహా మేరకే మెట్లు ఎక్కడ దిగడం చేయమంటున్నారు.