Categories
ఇలా మీటూ తో బయటికి వచ్చి తమ అనుభవాలు చెప్పే వాళ్ళు చాలా ధైర్యవంతులు, వాళ్ళను ఖచ్చితంగా అభినందించాలి. నేను మీటూ ఉద్యమాన్ని సపోర్టు చేస్తున్న అంటోంది సమంత. వాళ్ళను ఉద్దేశించి ట్వీట్ చేశారు సమంత. మీటూతో ముందుకొచ్చి మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంది. ఇలంటి విషయాలు బయటపెట్టిన రుజువేంటి అని కొందరు పురుషులు అడుగుతుంటారు. కొందరు స్త్రీలు కూడా ఈ సందేహాన్ని వ్యక్తం చేసి బాధితులను కించపరిచేందుకు చూస్తుంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం అందరు బటయకి వచ్చి మాట్లాడటం వల్ల చాలా మందికి రక్షణ దొరుకుతోంది.ప్రపంచం గురించి ఏ మాత్రం అవగామాన లేని చిన్న అమ్మాయిలను కూడా కాపాడుతున్నామని దృష్టిలో పెట్టుకోండి.మీటూ అందరం థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు సమంత.