ఒక విత్తనం మొలకెత్తడానికి మొక్కగా మారే దశని మైక్రో గ్రీన్స్ అంటారు.ఏడు నుంచి 21 రోజుల్లో ఇవి పెరిగిపోతాయి.ఆకులు కాండమే ఆహారం యోగ్యం.ఈ విత్తనాలు ప్రత్యేకంగా ఉంటాయి మార్కెట్లో 30 రకాలు మైక్రో గ్రీన్స్ ఉన్నాయి. ముల్లంగి, బ్రోకోలి, క్యాలీఫ్లవర్, కొత్తిమీర, వాము, వరి గోధుమ, సెనగ, బార్లీ వంటి బుల్లి మొక్కల్లో రెండు ఆకులను తిన్న ఆరోగ్యమే. వీటి పనిముట్లు, పరికరాలు ప్రత్యేక మట్టి,ట్రే లు కూడా అమ్మే కంపెనీలు వచ్చాయి. తక్కువ సమయంలో పెరిగే మైక్రో గ్రీన్స్ ఆరోగ్యం రుచికరం మినరల్స్ విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఎక్కువ మోతాదులో పోషకాలు ఉంటాయి.కనుక తక్కువే తీసుకోవాలి పోషక విలువల శక్తినిచ్చే కొత్త తిండి ఈ మైక్రో గ్రీన్స్. ఫైబర్ తక్కువ గా,ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండటం వల్ల పచ్చిగా తినేందుకు రుచిగా ఉంటాయి.
Categories