40 ఏళ్ళు వచ్చేలోగానే పిల్లలని కనేయండి అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు . తండ్రి తల్లి కీ ఈ సలహా వర్తిస్తుంది . 40 ఏళ్ళు వచ్చే సరికి పురుషుల్లో శుక్ర కణాల సంఖ్య వాటి ఆరోగ్యం మారి తండ్రి అవ్వలేక పోవచ్చు . తల్లికి అనారోగ్యాలు రావచ్చు . గర్భ సమయంలో షుగర్ పెరగటం,నెలలు నిండకుండా ప్రసవం వంటి సమస్యలు వస్తాయి . పుట్టిన పిల్లలు తగినంత బరువు లేకపోవటం పుట్టుకతో లోపాలు వస్తాయి . పిల్లలు ఎదిగే వయసులో ఆటిజం వంటి మానసిక సమస్యలు ఇతర అనారోగ్యాలు రావచ్చు . 40 ఏళ్ళ పాటు ఈ పరిశోధన నిరంతరంగా సాగిన తర్వాతే వయసు మీరాక ముందే తల్లి దండ్రులు అవండి అని చెపుతున్నారు .

Leave a comment