ఏదైనా కొత్తగా కనిపించాలి అంటే జ్యువెలరీ ని ప్రత్యేకంగా ఎంచుకోవాలి లేయర్ నెక్లెస్తో ఎలాంటి వస్త్రధారణకైనా సరికొత్త లుక్ తీసుకురావచ్చు. వేరువేరు పొడవులతో వుండే ఈ గొలుసులను ఒక దానికింద ఒకటిగా అమర్చి తయారు చేస్తారు సన్నటి చెయిన్ లే ఐదారు ఉండటం వల్ల భారీగా కనిపిస్తుంది. ఈ సన్నటి వరుసలను కలుపుతూ ఒవైపు భారీ పెండెంట్ వుండటం వల్ల వేడుకల్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఫ్యాన్సీ పట్టు చీరెలు ఏవైనా చక్కని లుక్ వస్తుంది. ఈ లేయర్ నెక్ లెస్ కు మ్యాచింగ్ గా లేయర్ బ్యాంగిల్స్ లేయర్ బ్రాస్ లెట్లు మంచి ఎంపిక. అలాగే లేయర్ రింగ్స్ పెట్టుకొంటే చేతికి అందం వస్తుంది. ఒకే భారీ వుంగరం బదులుగా లేయర్ రింగ్స్ లేటెస్ట్ ఫాషన్ కూడా ఇవి సాదా డిజైన్ లలోను,రాళ్ళు పొదిగినవీ వస్తున్నాయి.

Leave a comment