సోషల్ మీడియా పుణ్యన ,ఏ మారుమూల, ఎక్కడ ఏ టాలెంట్ ఉన్న అది వెంటనే వైరల్ అవుతుంది.మనుష్యుల కేరాఫ్ లో సంబంధం లేకుండా ప్రశంసలు కురుస్తున్నాయి. పసల బేబీ వాట్సాప్ లో ఓ చెలియా నా ప్రియ సఖియా పాటకి లక్షకి లైకులు తెచ్చుకుంది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరు గ్రామానికి చెందిన ఒక సాధారణ మహిళ. అక్షరం నేర్చుకోలేదు.కూలి పనులకు వెళ్ళి కుటుంబం పోషించుకొంటుంది. పనులకు పోయినప్పుడు ఈమె పాట విని అలసట మరిచేవారందరూ. అనుకోకుండా పక్కింటికి వెళ్ళి ,చేతిలో బక్కట్టు పక్కన పెట్టుకొని ఈమె పాడిన ఓ చెలియా పాటని పక్కంటి అమ్మాయి రాణి ఫేస్ బుక్ లో పెడితే ఏడు లక్షల మంది చూశారట.ఒక్క నిమిషంలో బేబీ సెలబ్రిటి అయింది. సిని ప్రముఖులు కూడా ఇప్పుడు పాడమని ఈమెను అడుగుతున్నారట.

Leave a comment