అమ్మ వైపు నుంచి వనపర్తి సంస్థానాధీశుడు రాజా కే రామేశ్వరరావు నాన్న వైపు నిజాం కాలంలో హైదరాబాద్ ప్రధానమంత్రి అక్బర్ హైదరీ. రెండు రాచకుటుంబాలకు చెందిన అదితిరావ్ హైదరీ ‘సమ్మోహనం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా అంటే మానవ భావోద్వేగాల సమ్మేళనం కనుక మనిషి ఫీలింగ్స్ ఎక్కడైన ఒక్కటే కాబట్టి ఏ భాష అయినా నాకు ఒక్కటే అని చెప్పే అదితి. తనకు తనకు మరువలేని అనుభూతి. కాట్రు వెలియాడై, వాన్ వరువాన్‌ (తెలుగులో చెలియా మై మరుపా) పాట పాడటం ఏఆర్‌ రెహమాన్‌ తో కలిసి లైవ్ లో పాడటం మరిచిపోలేదంటుంది. ఈ పాట రెహమాన్ సారధ్యంలో నెనోక్కదాన్నే స్టేజీ పైన పాడటం ఇంకా ఇష్టమైన విషయం అంటుంది. భయం వేస్తే నా వైపు చూస్తూ పాడు అన్నారు రెహమాన్. అలాగే పాడాను ఆ సంతోష సమయం నేను మరవలేను అంటుంది అదితిరావు హైదరీ.

Leave a comment