కొన్ని జాబ్స్ కు డ్రెస్ కోడ్ ఉంటుంది. అది ఆఫీస్ హుందాతనాన్ని తెలియజేస్తుంది. అలాంటి కండీషన్ లేకపోయినా ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిలు కొన్ని చిన్ని జాగ్రత్తాలు పాటిస్తే ప్రత్యేకంగా ఉంటారు. దుస్తులు ఖరీదైనవి కావటం అంటే అవి వేసుకుంటే అవి నప్పుతయో లేదో గమనించుకోవాలి. సరైన కొలతల్లో కుట్టించుకోవాలి. లైట్ ఫిట్ అయినా లూజ్ గా ఉన్నా బావుండవు. జుట్టు చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏలాంటి కేశాలంకరణ అయిన సరే జుట్టు చిట్లిపోకుండా పొడి బారకుండా కాంతి లేకుండా ఉండకుండా చూసుకోవాలి. అలాగే చెప్పులు కూడా ఫంకీ డిజైన్లు, మెరిసే రకాలు కాకుండా నలుపు, బ్రౌన్ క్రీం వంటి సాదా రంగులు ఎంచుకుంటే బావుంటాయి. ధరించే దుస్తులు,మొహం పై చిరు నవ్వు మన గురించి ఎదుటివాళ్ళకు చెప్పేస్తాయి.

Leave a comment