Categories
మితాహారం ఆరోగ్యకరమని చెప్తారు ప్రాచీనులు. తక్కువ క్యాలరీలు ఆహారాన్ని నియమిత సమయంలో తింటే ఎక్కువ కాలం జీవిస్తారని హోవార్డ్ హ్యూజెన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు. పగటిపూట మనం చురుకుగా ఉండే సమయంలో తగు మోతాదులో ఆహారం తీసుకుంటే దీర్ఘకాలం జీవించవచ్చు అంటున్నారు. తక్కువ ఆహారంతో వయస్సుతోపాటు పెరిగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఆయుష్షు పెరుగుతోందని వారు చేసిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.