Categories
దేవుడి మొక్కలు మనకు చాలా తెలుసు తలనీలాలు ఇవ్వటం, పొంగళ్ళు పెట్టటం, బెల్లం తులాభారం ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి కానీ తంజావూరు దగ్గరున్న వలంగైమాన్ లో మరియమ్మన్ గుళ్లో మొక్కు మాత్రం చాలా విచిత్రం. అక్కడకు వెళ్లి ఫలానా కోరిక తీరాలి అని మొక్కుకొని కోరిక తీరాక ఏం చేయాలంటే చనిపోయిన వారి మాదిరిగా పాడే ఎక్కి ఊరంతా తిరగాలి చివరకు గుళ్లోకి వెళితే పూజారి తులసి తీర్థం ఆ పాడే మీద ఉన్న భక్తుడి నోట్లో పోసాక మొక్కు తీరిపోతుంది. ఇలా పాడే ఎక్కటం వల్ల మరియమ్మన్ ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.