Categories
Gagana WhatsApp

మార్నింగ్‌ ఐకాన్‌ కేఫ్‌

మహిళల కోసమే ఒక కేఫ్ అవసరం అనుకొన్నది Um Feras అరేబియన్ ద్విప కల్పంలో రెండో పెద్ద దేశమైన రెండో పెద్ద దేశమైన యెమన్‌ ఆరేళ్ల అంతర్యుద్ధం వల్ల మొత్తం తన స్వరూపాన్నే కోల్పోయింది. అలాటి ప్రాంతాల్లో మరిబ్‌ కూడా ఒకటి. గత ఏడాది ఏప్రిల్‌లో మరిబ్‌ లో  ‘మార్నింగ్‌ ఐకాన్‌ కేఫ్‌’ మొదలుపెట్టింది ఉమ్ ఫెరాస్. మన దేశంలో మహిళలు ఒకచోట గుమ్ముగూడి కబుర్లు చెప్పుకొనే స్వేచ్ఛ లేదు. అప్పుడే నాకు ఇలాటి కేఫ్ ఏర్పాటు చేస్తే,అది మహిళలు తమ సమస్యలు తోటివారితో పంచుకొనే ఒక వేదిక అవుతోందని భావించాను . నా కేఫ్ లో అందరు స్త్రీలే పనిచేస్తారు. కేఫ్ లోకి తల్లులతో పాటు పిల్లలూ రావచ్చు అంటోంది  ఉమ్ ఫెరాస్. సాంప్రదాయ వాదులతో నిండిన మారిబ్ లో కేఫ్ నడపటం అంటే అదంత ఆషామాషీ మాత్రం కాదు.

Leave a comment