Categories
జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే వయసు తో పాటుగా శరీరంపై ముడతలు పడటానికి వృద్ధాప్య లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే తాజా పండ్లు కూరగాయలు ఆకుకూరలు రోజు తీసుకోవాలి. విటమిన్-ఎ అధికంగా ఉండే క్యారెట్, టమాటా, పాలకూర, చిలకడదుంపలు, బ్రోకలీ మొదలైనవి తినాలి దోసకాయ, కీర దోస, ముల్లంగి వంటి కూరగాయలు అధికంగా తినాలి. రోజూ రెండు లీటర్ల మంచినీళ్లు తాగాలి. చర్మానికి తరచుగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. డాక్టర్ సలహాతో ఏదైనా యాంటీ ఏజింగ్ క్రీమ్ వాడటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.