Categories
ముఖంపైన జిడ్డు తేరడం ఒక ప్రధనమైన సమస్య .ఇందుకు తాజా పండ్లు కలబంద వంటివి ఎంతో ఉపయోగపడతాయి. ఎన్నో ఔషధగుణాలున్న కలబంద ఈ సమస్యకు మొదటి పరిష్కారం,కలబంద గుజ్జుతో మొహం పైన మృదువుగా మర్థన చేస్తే మొహం మెరుస్తుంది.జిడ్డు ఎక్కువగా ఉంటే వెనిగర్ లో బేకింగ్ పొడి వేసి ఆ నీళ్ళతో ముఖం కడుక్కుంటే వెంటనే ఫ్రెష్ అవుతారు.ఏదైన పార్టీకి వెళ్ళాలంటే ఈ చిట్కా ఉపయోగపడుతుంది. మొహాన్ని వెంటనే జిడ్డు పట్టనివ్వదు. యాపిల్ ,నారింజ, నిమ్మ వంటివి మంచి క్లెన్సర్ లు ,వీటి రసంలో కాటన్ ముంచి ముఖం తడుచుకొన్న జిడ్డుపోతుంది. తేనే కీర దోస రసం బాగా పని చేస్తుంది.