శరీరం ఎప్పుడూ నిత్య చైతన్యంతో కదులుతూ ఉండాలి. రోజు మొత్తం మీద శరీరానికి ఎంతో కొంత చురుకుదనం ఇచ్చేందుకు అనేకనేక అవకశాలు ఉన్నాయి. చిన్న చిన్న మార్పులే గుర్తించలేనంత ఫలితం ఇస్తాయి. వీధి చివర ఉన్న షాపుకు కూడా వాహనం పై వెళ్ళకుండా నడచి వెళ్ళటం మంచి పద్దతే కదా.కుదిరినప్పుడల్లా మెట్లెక్కి దిగుతూ ఉంటుంటే శరీరానికి వ్యాయామం దోరుకుతుంది.స్విజ్జర్లాండ్ పరిశోధకులు జరిపిన ఒక పరిశోధనలో అస్తమానం కూర్చోవటం వల్ల కొవ్వుల్ని కరిగించే లిపో ప్రొటీన్ అనే ఎంజైమ్ పని తీరు 90 శాతానికి తగ్గిపొతుందట. జీవక్రియ వేగం తగ్గుతోంది,రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుదల నియంత్రించే ఎంజైమ్ విడుదల ఆగిపోతుంది.

Leave a comment