Categories
స్వీట్లు తగ్గించాలి ఆరోగ్యం కోసం ఒక రకంగా మానేయాలి అంటున్నారు డాక్టర్లు.ఒక ఐదు కిలోమీటర్లు నడిస్తే 200 కేలరీలు ఖర్చవుతాయి.అయితే చిన్న గులాబ్ జామ్ తిన్న ఆ రెండు వందలు వచ్చి చేరుతాయి.ఇలా లెక్క వేసుకొని స్వీట్లు మానేయాలని మానసికంగా సిద్ధం కమ్మంటున్నారు డాక్టర్లు.కోవా, కలాకండ్, రసగుల్లా, సేమియా పాయసం, బియ్యం పాయసం వంటి నూనె తగలని స్వీట్లు చాలా తక్కువగా నోట్లో వేసుకుంటూ వీటిలో క్యాలరీలు ఉంటాయని గుర్తు చేసుకుంటూ పుచ్చకాయ, బత్తాయి, మామిడి, పైనాపిల్ వంటివి తీసుకోవటం మొదలు పెట్టాలి.ఫ్లేవర్డ్ మిల్క్ లు తాగి తీపి తినాలనే కోరిక తీర్చుకోవాలని అంటున్నారు.