బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తినమని చెబుతూ ఉంటారు న్యూట్రిషనిస్ట్ లు.ఆరోగ్యంతో పాటు బరువు తగ్గించ గల ఓట్స్ పెద్ద రుచి గా ఉండవు. వాటికి పండ్లు లేదా ఉప్పు సుగంధ ద్రవ్యాలు జోడించి ఎంతో రుచిగా ఉంటాయి.రాత్రంతా నానబెట్టిన ఓట్స్ తినటం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది అంటున్నారు పోషకాహార నిపుణులు.వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నానటం తో ఓట్స్ లోని పిండిపదార్థం ముక్కలై పోయి వాటిలో ఆమ్లా శాతం తగ్గుతుంది. మెత్తగా ఉండే ఆ ఓట్స్ తేలికగా జీర్ణం అవుతాయి. శరీరంలో ఇన్స్ లిన్ పెరుగుతుంది.ఫలితంగా టైప్-2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. పాలు, నీళ్లు, పెరుగు, బాదం లేదా కొబ్బరి పాలు, నెయ్యి, ఉప్పు, పండ్లు నట్స్ రుచికోసం కలుపుకోవచ్చు.

Leave a comment