కరోనా సమయం ఎన్నో కొత్త ఆలోచనకు తెరదీసింది. ముఖ్యంగా విశాలంగా ఉండే గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్లలో నివశించటం ఆరోగ్యం అన్న భావనకు అందరూ వచ్చారు కిచెన్ విషయంలో కూడా చాలా మార్పులు ఆలోచనల్లోకి వస్తున్నాయి ముఖ్యంగా మాడ్యులర్ కిచెన్ అయితే ప్రతి వస్తువు సొరుగుల్లో, అరల్లో సర్దుకోవచ్చు వంటగది విశాలంగా గాలి వెలుతురు వచ్చేలా ఉంటుంది. వంట చేసే అరుగులు సింక్ లు తడి నిలువకుండా పొడిగా అయ్యేలా శ్రద్ధ తీసుకుంటున్నారు సింక్ స్టెయిన్ లెస్ స్టీల్  అయితే శుభ్రంగా కడిగి తుడి చేయవచ్చు. బయట నుంచి తెచ్చుకున్న ప్రతి వస్తువు నీళ్లతో కడగటం ఆరేలా వాటిని శుభ్రమైన ప్రదేశంలో ఉంచటం తప్పనిసరి అయింది  కాబట్టి ఇవన్నీ వంటగదిలో వీలుగా చేసుకునేందుకు వంటిల్లు రీ మోడల్ చేస్తున్నారు చాలామంది.

Leave a comment