Categories
‘నాకు ఎన్ని భయాలో తెలుసా . బైక్ రైడింగ్ అంటే భయం నడపటం ఓకె ఎందుకంటే హాండిల్ మన చేతిలో ఉంటుంది . ఖాళీ రోడ్ల పై బండి నడపటం కూడా భయం . పదిమంది ముందు మాట్లాడటం భయం . తప్పులు చేస్తానేమో అని ముందే భయపడతాను అంటోంది రష్మిక మండన్న . రష్మిక సరిగ్గా చేయలేదు అని సినిమా చూసిన ప్రేక్షకులు అనుకోకూడదు . ఇది కూడా నన్ను చాలా భయ పెడుతుంది . ఆ భయం ఉండటం వల్లే చాల జాగ్రత్తగా పనిచేస్తాను . గెలవాలన్నా తపన ఇంకా పెరుగుతుంది . సినిమా పూర్తివగానే గుడ్ భై చెప్పాలనుకొను నా వైపు నుంచి ఇంకా ఏమైనా చేయాలేమో నాని ఆరాతీస్తూనే ఉంటాను . సినిమా పూర్తయ్యే వరకు అదే ధ్యాస అంటోంది రష్మికా మండన్న