Categories
23 సంవత్సరాల మధులిక శర్మ సూపర్ మోడల్ కాస్మోపాలిటన్ వోగ్ ఎల్లీ హార్పర్స్ బజార్ వంటి ప్రముఖ మ్యాగజైన్ పేపర్ పేజీల్లో ఆమె కనిపిస్తుంది. ఢిల్లీ మిరాండా హౌస్ కాలేజ్ లో పొలిటికల్ సైన్స్ చదువుతున్నప్పుడే ఆమెకు మోడల్ గా పనిచేసే అవకాశం వచ్చింది. లాక్మే ఫ్యాషన్ వీక్ అమెజాన్ ఫ్యాషన్ వీక్ లలో వేదికపైన ర్యాంప్ పై నడిచింది మధులిక శర్మ తన గురించి మాట్లాడుతూ ఎంతో పోటీ ఉండే మోడలింగ్ రంగంలో రాణించటానికి వైవిద్యమైన నా రూపం కారణం అనుకుంటున్నా. నేను అస్సాం లో పుట్టి పెరిగాను అమెరికా లో సూపర్ మోడల్ గా ఎదిగానంటే నాకే గర్వంగా ఉంది. రాల్స్ రౌలెన్,శాక్స్ ఫస్ట్ అవెన్యూ ,అమెరికన్ ఈగల్ వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్ కు మోడలింగ్ చేస్తున్నా అంటుంది మధులిక.