ఆకుపచ్చని దళసరి ఆకులు ఉండే వామాకు ఎంతో అందంగా చక్కని పరిమళం వెదజల్లుతుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకు వాసన పీల్చితే జలుబు తగ్గుతుంది కఫం పడుతుంటే గ్లాసుడు నీళ్లలో నాలుగు వామ్ ఆకులు వేసి మరిగించి తాగితే ఫలితం ఉంటుంది. దగ్గు ఉబ్బసం శ్వాసకోశ వ్యాధులకు ఇది చక్కని ఔషధం ఇందులో ఏ బి సి విటమిన్లు అమినో ఆమ్లాలు యాంటీఆక్సిడెంట్లు క్యాల్షియం ఉంటాయి. ఇది మంచి పోషకాహారం కూడా వామాకులతో సెనగపిండి తో బజ్జీలు వండుకుంటారు చిన్న కుండీలో ఒక బలమైన కాడ ని తెచ్చి గుచ్చిన బతుకుతుంది. కుండీ నిండుగా పచ్చని ఆకులతో చూడచక్కగా ఉంటుంది కూడా.

Leave a comment