ముందు నేను నాటకాలే ఎంచుకొన్నాను. మోడలింగ్ చేస్తూ రంగస్థలం వైపు వెళ్ళాలనుకొన్న కానీ ఆ తపన కాస్త ఇటు సినిమాల వైపు అడుగులు వేసేలా చేసింది అంటోంది నభా నటేష్. నాకు నచ్చిన పాత్రలయితే అభిమానులను అలరించే అల్లరి పాత్రలే. మనసులో టెన్షన్ వదిలేందుకు వినోదభరితమైన సినిమాలు చూస్తారు ప్రేక్షకులు.వాళ్ళు రెండు,మూడు గంటలు హాయిగా నవ్వుకొనేలా చేయగలిగే సినిమాలు నాకు ఇష్టం. ఇక హీరోయిన్ ఓరియంటెడ్ ,సందేశాలు నాకు పెద్ద ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. ఇప్పటికైతే అంతర్లీనంగా ఏదో ఒక సందేశం ప్రతి సినిమాలోనూ ఉంటూనే ఉంటుంది. అందుకే ప్రేక్షకులను అభిమానులను అలరించే పాత్రలకే నా మనసులో చోటు. ఒకే రకమైన పాత్రలు కాకుండా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది అంటోంది నభానటేష్.

Leave a comment