నవతరం అమ్మాయిలకు స్ఫూర్తి కియారా మార్షల్. న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్‌లో నివసిస్తున్న కియారా ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగు లేని మోడల్. టామీ హిల్‌ఫిగర్, టీన్‌ వోగ్‌ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు మోడలింగ్‌ చేస్తుంది కియారా.పదేళ్ల వయసులో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ఓ కారు ఆమెను ఢీ కొట్టింది. కుడి కాలి మీదుగా కారు వెళ్లిపోయింది.వైద్యులు  ఆమెను బతికించగలిగారు కానీ, ఆమె కాలిని వైద్యులు రక్షించలేకపోయారు.ఈ శారీరక వైకల్యం తోనే మోడలింగ్ లో ఎదిగింది కియారా కృత్రిమ పాద ఇంప్లాంట్‌ ని అమర్చుకొని ఆ కాలుని దాచుకోకుండా నే ఫోటోలకు ఫోజులిస్తుంది. తనలాంటి యువతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పని చేయాలను కొంటున్నాను. వికలాంగ అమ్మాయిలు సమాజంలో నిలదొక్కుకోనే హక్కు ఇవ్వాలనేదే నా ఆశయం అంటోంది కియారా మార్షల్ .

Leave a comment