Categories
మేజర్ సుఖ్వీందర్ జీత్ రాధ్వా 1997 జమ్ము, కాశ్మీర్ లో తీవ్రవాదుల దాడికి గురై మరణించాక ఎనిమిది నెలలకు మిలటరీ లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు ఆయన భార్య రవీందర్ భరత చనిపోయేనాటికి వాళ్ల పెళ్లయి మూడేళ్లు నెల పాప వుంది. పాపది ఏడాది వయసు వచ్చాక మిలటరీ లో చేరేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ వప్పించి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్ష రాసి అర్హత సాధించారు. 1990లో విధుల్లో చేరి లెఫ్టినెంట్ కర్నల్ స్థాయికి చేరారు రవీందర్. చనిపోయిన సైనికుని భార్య సైన్యంలో చేరటం ఆమెతోనే మొదలైంది. ఈ ప్రయాణం కష్టమే కానీ నా భర్త కోరిక నిజం చేశాననే తృప్తి నాకుంది అంటారు.ఈ వీరనారి.