Categories
బెల్ స్లీవ్స్ 60,70 ల నాటి ఫ్యాషన్.. ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని స్టేట్ మెంట్ స్లీవ్స్ అంటున్నారు భుజం దగ్గర బిగుతుగా ఉండి కిందికి వచ్చేసరికి వెడల్పుగా గంట ఆకారంలో స్లీవ్స్ ఉంటాయి వీటిలో ఆఫ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ త్రీ ఫోర్త్ మోచేతి వరకు మన ఇష్టం కొద్దీ కుట్టించుకోవచ్చు. మోచేతి వరకు బిగుతుగా ఉండి కిందకు బెల్ లాగా ఉండే ఫ్యాషన్ ఇప్పటి ట్రెండ్. జార్జెట్ చీరెల పైకి బెల్ స్లీవ్స్ చాలా అందంగా ఉంటాయి. గౌన్లు స్కర్ట్ ల వరకే పరిమితంగా ఉండే ఈ స్లీవ్స్ స్టయిల్ జాకెట్లు, స్వెటర్లు, చుడిదార్ లు చీరల కు వచ్చేసింది.