Categories

అధ్యయనాల సారాంశం నమ్మితీరాలి. ఎన్నో వందల మందిపైన బాధ్యతగా పరిశోధన చేసి రిజల్ట్ ప్రకటిస్తారు. కనుక ఆ సారాంశం మనకి ఉపయోగపడుతుంది. ఐదు గంటలకు మించి టి.వి చూసిన ,ఒకే చోట కదలకుండా కూర్చున్న రాబోయో కాలంలో నడిచే శక్తి తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు. ఒకే ప్రదేశంలో ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల కండరాల్లో కదలిక తగ్గిపోతుందని దానితో శరీర భాగాలు పని చేయడం మానేస్తాయని పరిశోధనలు చెపుతున్నాయి. శరీర భాగాలు నడిచేందుకు , పరుగు తీసేందుకు, చేతులు బలమైన వస్తువులు ఎత్తగల ధృఢత్వంతోనూ ఉంటాయి వాటిని సంక్రమంగా వాడలేక పోతే అవి క్రమంగా శక్తి పోగొట్టుకుంటాయని చెపుతున్నారు.