త్రిపర్ణ బెనర్జీ ఫిల్మ్ మేకర్,స్క్రిప్ట్ రైటర్.ఈమె తీసిన షార్ట్ ఫిల్మ్ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది.ఆ షార్ట్ ఫిల్మ్ పేరు నెయిల్స్.సైకలాజికల్ హారర్ చిత్రం ఇది.ద గిఫ్ట్, వన్ మోర్, ది స్కూల్ ఇన్ ది క్లౌడ్, డాక్ ఘర్ వంటి సినిమాలకు పనిచేసింది త్రిపర్ణ.ఈమె దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ రైడింగ్ అన్ ద మూన్ బొట్.ఈ చిన్న సినిమా బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు గెల్చుకొంది.త్రిపర్ణ స్క్రీన్ రైటింగ్ ప్రొఫెసర్.ఎన్నో సంస్థల్లో విద్యార్థులకు స్క్రీన్ రైటింగ్ పాఠాలు చెప్తుంది.

Leave a comment