తమ గురించి గొప్పలు చెఫ్పుకునే వాళ్ళని చాలా మందిని మన చుట్టు కూడా చూస్తూ ఉంటాం. కాని ఇతరులలో ధైర్యం నింపేందుకు మన లోపాలను ఒప్పుకునేందుకు చాలా ధైర్యం కావాలి.ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో కాని ప్రియాంక చోప్రా మాత్రం నే అస్తమా వ్యాధితో బాధపడుతున్నా అన్నారు. ఒక మీటింగ్ లో అస్తమా వ్యాధి గ్రస్తుల్లో ధైర్యం నింపేందుకు గాను ఏర్పాటు చేసిన ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ప్రియాంక నాకు బాగా దగ్గరగా ఉన్న వారికి నేను అస్తమా పేషెంట్ అని తెలుసు. ఈ విషయాన్ని దాచాలని నాకెంత మాత్రం లేదు. ఎందుకంటే అస్తమా నన్ను గుప్పిట్లో తిసుకునే ముందే దాన్ని కంట్రోల్ చేయడం నాకు తెలుసు. నా గోల్ ని చేరుకోవడంలో నా అస్తమా వ్యాధి నాకు ఎప్పుడు అడ్డంకిగా లేదు అని చెప్పుకొచ్చింది ప్రియాంకచోప్రా.