Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/07/MV5BN2U1YjY0M2MtNDIzNC00NTFjLTkwNDgtOGU4YzUwYTQwZjk3XkEyXkFqcGdeQXVyNDUzOTQ5MjY@._V1_UY317_CR200214317_AL_.jpg)
డియర్ కామ్రెడ్ అనే సినిమాలో క్రికెటర్ పాత్ర పోషిస్తోందట రస్మిక మండొన్న. దాని కోసం ప్రాక్టీస్ చేసేస్తోందట. అసలు నేను బ్యాట్ పట్టుకోవడం ఇదే మొదటిసారి. అసలు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మహిళ క్రికెటర్ల మీద నాకెంతో గౌరవం పెరుగుతుంది. ఈ క్రీడ కోసం మానసిక సామార్ధ్యం చాలా అవసరం అంటోంది రస్మిత మండొన్న . ఈ పాత్ర గురించి విన్నప్పుడు నేను చేయగలనన్న విశ్వాసం లేనే లేదు. క్రికెట్ అనుభమే లేదు. అయినా ప్రాక్టీస్ మొదలు పెట్టాక మాత్రం నేనే ఆ పాత్ర చేయగలను అనిపించింది అంటోంది రస్మిక. నిజానికి ఒక్క సినిమా తో ఒక్కో కొత్త విద్య అలవడుతోంది. ఇదో అదృష్టం అన్నారామే.