బలం బలహీనత రెండు మనలోనే ఉంటాయి నేను బలవంతురాలు లేని అన్న ఆలోచన మనసులో మెదిలి మొదలెడితే ప్రపంచం మొత్తం ఆ నమ్మకానికి బలం ఇస్తారు అంటుంది క్రీడాకారిణి వినేష్ ఫోగాట్. పెద్దనాన్న మహా వీర్ ఫోగాట్ పెంపకం నన్నెంత బలవంతు రాలిని చేసిందంటే ఒలంపిక్స్ లో తీవ్రమైన గాయాలతో ఏడాది పాటు చక్రాల కుర్చీ లో గడిపాను.వెంటనే కోలుకొని ఒలంపిక్స్ కు తయారయ్యానంటే ఆయన శిక్షణ మహిమ అది నాకు ఖేల్ రత్న వచ్చినా అది నా పెద్ద తండ్రి చలువే నాకు మా నాన్న లేని లోటు ఎప్పుడు తెలియదు ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నక మా నాన్న మొహం వెలిగిపోయింది.నేను మా తండ్రి వారసురాలిని అని చెప్పుకునేందుకు ఎప్పుడూ గర్వపడతా అంటుంది వినేష్ ఫోగాట్.