Categories
లిప్ స్టిక్ వేసుకునే ముందర పెదవుల పైన ఎలాంటి జిడ్డు లేకుండా చూసుకుని శుబ్రంగా పెదవ్వులు కడుక్కుంటే బావుంటుంది. రంగు రిమూవ్ చేసుకోగానే లిప్ బామ్ రాసుకోవాలి. అప్పుడే పెదవులు ఫ్రెష్ గా పగుళ్ళు లేకుండా ఉంటాయి. పెదవులకు వేసే లిప్ స్టిక్ ఖరీదు ఎక్కువైనా మంచి నాణ్యమైన రకాలు చూసి ఎంచుకోవాలి. పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి. ఒక సారి పెదవులకు లిప్ స్టిక్ అప్లయ్ చేసి రెండు నిమిషాల తర్వాత టిష్యులతో అడ్డుకుని మరోసారి రాసుకుంటే చాలాసేపు చెదిరిపోకుండా వుంటుంది. కష్ట చక్కర చేతి లోకి తీసుకుని పెదవుల పైన రుద్దితే మ్రుతకనాలు పోయి పెదవులు చక్కగా ఉంటాయి. అప్పుడు రంగు వేస్తె తాజాగా ఉంటాయి.