నీహారికా,
బిజీగా ఉండటం లో ఒక ఆనందం ఉంటుంది. క్షణం తీరిక లేకుండా కెరీర్ గురించిన పరుగు మనకు సంతోషం ఇస్తుంది. కాని ఇక్కడే చిన్న ఇబ్బంది వస్తోంది. మాన్ గురించి కాస్త ఆలోచించుకొని, ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామోనని సమీక్షించుకొనే సమయం ఇంకెక్కడుంటుంది మన లోపాలు తెలుసుకొని సవరించుకోనే దెట్ల. అందుకే ఎక్స్ పర్ట్స్ మీ కోసం కాస్త సంమయం మిగిల్చుకోండి. వ్యక్తిత్వ పరంగా ఉండే లోపాల్ని తెలుసుకోండి. అలాగే ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోండి. ఒక్కోసారి శరీరం కొన్ని సూచనలు ఇస్తుంది. అవి రొటీన్ ని ఇబ్బంది పెట్టక పోతే పట్టించుకోండి కాని చాల త్వరలో ఏదో అనారోగ్యం వచేస్తుంది. అలాగే సమయం లేదని ఎవ్వరితో మాట్లాడకుండా గిరి గీసుకొని పనే దేవుడని పరుగులు తీస్తాం. కాని నాలుగులో కలవని ఏకాంతం ఎంత వరకు మంచిది. ఒకవేళ ఎప్పుడైనా మనకే చుట్టూ స్నేహితులు కావాలని అనిపిస్తే అప్పుడు ఎవరు ఉంటారు? మనలో ఏమైనా నిరశాల్లు, ప్రతికూల అంశాలు ఉంటె అవి ఎప్పటి కప్పటికి డిలీట్ చేసుకొనే ప్రయత్నాలు చేయాలి. వీలైనంత వరకు సానుకూలంగా మనకు స్పందించేలా ఉంచుకోవటం చాలా ముఖ్యం. తీరిక లేని పరుగుతో ఏదైనా పోగొట్టుకొంన్నమో అన్ని ప్రతిరోజు వెతుక్కోవాలి.