కగ్గన పల్లె రాధాదేవి నారీ శక్తి పురస్కారం అందుకున్నారు రైలు ప్రయాణాన్ని విమాన ప్రయాణం లాగా మార్చేందుకు రైల్ హోస్టెస్ ల సేవలు అవసరం అనే రైల్వే మినిస్టర్ ఒప్పించారు రాధాదేవి. అలాగే తిరుమల లో కళ్యాణకట్ట లో మహిళ మహిళ క్షురకులకు అవకాశం ఇవ్వాలని 2004లో పెద్ద పోరాటం చేశారు. ఇప్పుడు తిరుమలలో 656 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మహిళా రైల్ హోస్టెస్ ల సేవలు ప్రారంభం అవుతున్నాయి. బెంగళూరు చెన్నై మధ్య తిరిగే శతాబ్ది ఎక్సప్రెస్ లో ముందుగా సేవలు మొదలవుతాయి. సౌత్ జోన్, సౌత్ సెంట్రల్ జోన్ ల లోని అన్ని రైళ్లలో ఈ సేవలు ప్రారంభం అవుతాయి. ఈ రెండు జోన్ లలో శిక్షణ నిర్వహణ బాధ్యతలు రాధాదేవి చూస్తారు. భవిష్యత్ లో ఇదో పెద్ద ఉపాధి అవకాశం అంటారు రాధాదేవి.

Leave a comment