ఓట మీల్ తో ఎం చేసినా చప్పగా బావుండదు అనుకుంటారు. కొవ్వు లేకుండా పీచు ఎక్కువగా వుండే ఈ ఓట్స్ జీర్ణ వ్యవస్ధ కు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వుండే ప్రోటిన్ల వలన  గుండె ఎంతో బలం. ఆరోగ్యకరమైన శక్తినిచ్చే అల్పాహారం ఓట్స్  తో తయ్యారు చేసుకోవచ్చు. అరకప్పు నీళ్ళు , సోయా పాలు, మాములు పాలు కనీ వీలైనన్ని డ్రై ఫ్రుట్స్   వేసి  గింజలు తీసి సన్నగా తరిగిన ఖర్జూరం  ముక్కల  తో మంచి బ్రేక్ ఫస్ట్. అరకప్పు నీళ్ళు మరిగించి అందులో ఓట్స్ వేస్తె మెత్తగా అయిపోతాయి. ఇందులో పాలు పోసేసి ఖర్జూరం పలుకులు కలిపేస్తే  రుచికరమైన పాయాసం అయిపోతుంది. ఖర్జూరం తీయదనం ఇస్తుంది   కనుక చక్కెర    వేయాల్సిన అవసరం  ఉండు.

Leave a comment