ముంజేతి కింద చర్మం ఎన్నో కారణాలతో నల్లబడి పోతు ఉంటుంది .అధిక బరువు , స్వేదం తరచూ వ్యక్తి వ్యాక్సింగ్ ,షేవింగ్ , డియోడరింట్ , స్ప్రే వాడకం వల్ల కావచ్చు .రోల్ ఆన్ డియోడరింట్ లు వాడితే చర్మం నల్ల బడటాన్ని కాస్త తగ్గించ వచ్చు.నిమ్మరసం, బంగాళాదుంప , కీరా స్లైసుల్ని ప్రతి రోజు పదినిముషాలు పాటు నల్లబడిన ప్రదేశంలో ఉంచితే అవి సహకమైన బ్లీచ్ లు గా ఉపయోగిస్తాయి .చందనం పొడి , రోజ్ వాటర్ కలిపి ఫ్యాక్ అప్లయ్ చేసి ఇరవై నిముషాలు తర్వాత కడిగేయాలి .అలాగే ఒక స్పూన్ పాలు , ఒక స్పూన్ పెరుగు , ఒక స్పూన్ శెనగపిండి కడ్తా తేనే కలిపి ఆ పేస్ట్ ను నల్లబడిన ప్రాంతంలో అప్లయ్ చేసి కడిగేస్తే నెమ్మదిగా నలుపు పోతుంది .

Leave a comment