దేశంలోనే మొట్టమొదటి బర్త్ ఫోటోగ్రాఫర్ ఉర్షిత సెయివి . ప్రసూతి వార్డులో బిడ్డ పుట్టగానే ,మొదటి సారిగా తల్లి తండ్రి బిడ్డను చేతుల్లోకి తీసుకొన్నా క్షణాలని బంధిస్తుంది ఉర్షిత . ఆ అపురూపమైన క్షణాలని పదిలంగా ఉంచగలిగేట్లుగా ఫోటో తీయటం  ఉర్షిత  వృత్తిగా ఎంచుకోంది . ఇలాటి కెరీర్ ని ఎంచుకొన్నది బహుశా ఈమె ఒక్కతే . ఈ వృత్తి ఎంత కఠినమైనదో అంత అద్భుతమైనది . ఒక్కోసారి ఆసుపత్రిలో 70 గంటలు నిరంతరాయంగా ఉండవలసిన సందర్భాలు ఉన్నాయి . ఎక్కువ ప్రసవాలు అర్ధరాత్రి ,తెల్లవారుజామునే జరుగుతాయి . ఈ బర్త్ ఫోటోగ్రాఫీ వృత్తిగా ఎంచుకొన్నాక ఇప్పటికి 350 ప్రసవాలను నా కెమెరాలో బంధించాను . ఆ మధుర క్షణాలను తల్లిదండ్రులు చూసుకొనేప్పుడు ,వాళ్ళ కళ్ళలో కనబడే ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు అంటుంది ఉర్షిత .

Leave a comment